ETV Bharat / state

EETELA ON KCR: నన్ను అసెంబ్లీకి రాకుండా చేసేందుకే దళితబంధు: ఈటల - ఈటల రాజేందర్

దళితబంధు ఇచ్చినా కేసీఆర్​కు ఓటేస్తారా.. అందుకు కారణమైన మీ హుజూరాబాద్​ బిడ్డకు ఓటేస్తారా ప్రజలే నిర్ణయించుకోవాలని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. దళితబంధు పథకం మీ పట్ల ప్రేమతో కాదు.. నామీద ద్వేషంతోనే ఇచ్చారని విమర్శించారు. నియోజకవర్గంలోని కిష్టంపేట, రెడ్డిపల్లి గ్రామాల్లో ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు.

EETELA ON KCR
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/20-October-2021/13408653_pms.png
author img

By

Published : Oct 20, 2021, 6:45 PM IST

Updated : Oct 20, 2021, 10:21 PM IST

తెలంగాణ బిడ్డల బలిదానాల వల్లే రాష్ట్రాన్ని సాధించుకున్నామని హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​ అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్​ అయితే.. ప్రజలు పోరాడిన తెరాసను గెలిపించారని గుర్తు చేశారు. అలాగే దళితబంధు పథకం మీపై ప్రేమతో ఇవ్వలేదని.. కేవలం నాపై ద్వేషంతోనే ఇస్తున్నారని ఆరోపించారు. దళితబంధు ఇచ్చినా కేసీఆర్​కు ఓటేస్తారా.. అందుకు కారణమైన మీ బిడ్డకు ఓటేస్తారా మీరే నిర్ణయించాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కిష్టంపేట, రెడ్డిపల్లి గ్రామాల్లో ఆయన ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న నా ఆడబిడ్డల అభయహస్తం చెక్కులు ఇప్పుడు ఇస్తున్నారంటే అది కూడా నాపై కోపంతోనేనని ఈటల అన్నారు. వారిచ్చే పథకాలను తీసుకోండి.. కానీ వాటికి కారణమైన ఈటల రాజేందర్​ను మర్చిపోవద్దన్నారు. తెలంగాణ ఒక్క కేసీఆర్ వల్ల మాత్రమే రాలేదన్నారు. 1200 మంది బలిదానాలు చేస్తేనే రాష్ట్రం ఏర్పడిందని ఈటల పేర్కొన్నారు.

దళితబంధు మీపై ప్రేమతో రాలే. దళితబంధు ఈటల రాజేందర్​ అసెంబ్లీలో అడుగుపెట్టొద్దనే ద్వేషంతో ఇచ్చిండు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ను ప్రజలు గెలిపియ్యలే. పోరాడిన టీఆర్​ఎస్​ను గెలిపించిండ్రు. కానీ దళితబంధు ఇచ్చిన కేసీఆర్​కు ఓటేస్తారా..దానికి కారణమైన ఈటలకు ఓటేస్తారా తేల్చుకోండి. ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన అభయహస్తం డబ్బులు ఎప్పుడో ఇవ్వాల్సింది. నా మీద ద్వేషంతో ఇవాళ చెక్కులు ఇస్తున్నరు. రాష్ట్రం కోసం తెలంగాణ జాతి మొత్తం పోరాడింది. 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానం ఉంది. ప్రభుత్వమిచ్చే పథకాలు తీసుకోండి. కానీ దానికి కారణమైన ఈ బిడ్డను మర్చిపోకండి. సీఎం కేసీఆర్​ ప్రజలను కలవవ్. ప్రగతి భవన్​, ఫామ్​ హౌస్​లో ఉంటవ్. మంత్రులు కూడా నిన్ను కలిసే పరిస్థితి లేదు.

-ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి

నన్ను అసెంబ్లీకి రాకుండా చేసేందుకే దళితబంధు: ఈటల

ఇదీ చూడండి:

Huzurabad by election 2021: దళితబంధు ఆపాలని నేను లేఖ రాసినట్లు నిరూపిస్తారా?: బండి

Last Updated : Oct 20, 2021, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.