హుజూరాబాద్ ఉపఎన్నికలో భాజపా విజయం ఖాయమని మాజీమంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా భాజపా గెలుపును అడ్డుకోలేరని అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన భాజపా జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో తెరాల ప్రలోభాల పర్వం మొదలైందని ఆరోపించారు. అడగకున్నా ఇంటింటికి వెళ్లి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెరాస ఎన్ని విధాలుగా మభ్యపెట్టినా హుజూరాబాద్ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని రెండు పురపాలికలకు, ఐదు మండలాలకు భాజపా బాధ్యులను నియమించినట్లు తెలిపారు.
నాయకులను కొనుగోలు చేసే దుస్థితిలో ప్రస్తుతం తెరాస ప్రభుత్వం ఉందన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలను ఈ ప్రాంత ప్రజలు సహించరని పేర్కొన్నారు. తెరాస నీచ రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మోసం చేశాన్ని ప్రజలు గుర్తించారన్నారు. రానున్న ఉప ఎన్నికలో భాజపా గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బొడిగె శోభ, ఇతర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
యావత్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భాజపా బలోపేతానికి కృషి చేస్తాం. హుజూరాబాద్ నియోజకవర్గంలోని రెండు పురపాలకలకు, ఐదు మండలాలకు ఇంఛార్జ్‌లను నియమించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయ జెండా ఎగురవేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంతమందిని మభ్యపెట్టినా హుజూరాబాద్ ప్రజలు నావైపే ఉన్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభాలు చేసినా, ఓటర్లను కొనుగోలు జరిగినా ఇక్కడ ఎగిరేది మాత్రం కాషాయ జెండానే- ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత
ఇవీ చూడండి: