కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో... మున్సిపల్ ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులను కలెక్టర్ శశాంక పరిశీలించారు. ఎన్నికల రోజున పాటించాల్సిన నియమ, నిబంధనలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. శిక్షణలో ఇచ్చిన బుక్లెట్ను క్షుణ్ణంగా పరిశీలించి... పోలింగ్ రోజున జాగ్రత్త వహించాలని కోరారు. అభ్యర్థికి మద్దతుగా వ్యవహరించొద్దని సూచించారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇదీ చదవండి: ఆంధ్రా జాలర్లను భారత్కు అప్పగించిన పాక్.. రేపు స్వగ్రామాలకు...