కరీంనగర్‌లో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్‌లో క్రికెట్ పోటీలు నువ్వానేనా అన్న విధంగా సాగుతున్నాయి. నాల్గవ రోజు సీనియర్స్, జూనియర్స్ వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. సీనియర్స్ విభాగంలో శ్రీచైతన్య డిగ్రీ పీజీ కళాశాలపై, శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల విజయం సాధించింది. కరీంనగర్ నిగమా కాలేజి ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌తో జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ జట్టు తలపడగా రెండు జట్లు పోటాపోటీగా పరుగులు సాధించారు. నిర్ణీత ఓవర్లలో రెండు జట్లు సమానంగా పరుగులు చేయడంతో సూపర్ ఓవర్‌కు అవకాశం ఇవ్వగా... రెండు వికెట్ల తేడాతో నిగమా జట్టు విజేతగా నిలిచింది. జూనియర్స్ విభాగంలోను పోటీ ఆసక్తికరంగా సాగింది. రేకుర్తి సాన్వి జూనియర్ కళాశాలపై, హుజూరాబాద్ కాకతీయ జూనియర్ కళాశాల విజయం సాధించింది.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన... వృద్ధురాలికి దొరికిన ఆశ్రయం