కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో దసరా పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయుధ, వాహన పూజల అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామ దేవతలకు ఊరేగింపు నిర్వహించారు.
రామడుగు మండల కేంద్రంలో వేణుగోపాల స్వామి, విఠలేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఊరేగించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి.. 'ఇంటి యాజమానులు.. మోటార్లు అందుబాటులో పెట్టుకోండి'