కరీంనగర్ జిల్లా దుర్శేడు గ్రామస్థులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. గ్రామంలోని పొలాలకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నీరందకుండా చేశారని పెద్దపల్లి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్సారెస్పీ నుంచి సాగునీటిని విడుదల చేయకపోతే.. ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.