కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. వెదిరలో పోలీసులు దాడులు నిర్వహించగా... ఓ పాత ఇంట్లో రూ. 1 లక్షా 40వేల విలువ గల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఓ వృద్ధురాలు ఈ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు విప్పేందుకు విచారణ మొదలుపెట్టారు.
భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా వెదిరలో విత్తన ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. వెదిరలో పోలీసులు దాడులు నిర్వహించగా... ఓ పాత ఇంట్లో రూ. 1 లక్షా 40వేల విలువ గల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఓ వృద్ధురాలు ఈ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు విప్పేందుకు విచారణ మొదలుపెట్టారు.
ఇదీ చదవండి: ఐదు రోజులు... ఆరు హత్యలు...