ఇదీ చూడండి: 'రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు'
దిగువ మానేరు పక్కనే డంపింగ్ యార్డ్.. విషతుల్యంగా మారుతున్న నీరు - దిగువ మానేరు పక్కనే డంపింగ్ యార్డ్.. విషతుల్యంగా మారుతున్న నీరు
కరీంనగర్ జిల్లాకేంద్రం శివారులో ప్రవహించే మానేరు వాగు విషతుల్యం అవుతోంది. ఇటీవల దిగువమానేరు జలాశయానికి వరద తాకిడి పెరుగగా.. అధికారులు తరచుగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే దిగువమానేరు జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేసినప్పుడు వాగు పక్కనే ఉన్న నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు చెత్త మొత్తం నీటిలో కలుస్తోంది. మరోవైపు.. వరద నీటిలో కొట్టుకొచ్చిన చెత్త, వ్యర్థాలు, కళేబరాలతో దిగువ మానేరు నీరు విషతుల్యంగా మారుతోంది. సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ది పనులు చేపడుతున్నప్పటికీ పరిశుభ్రతలో కీలకమైన డంపింగ్ యార్డు నిర్వహణ విషయంలో ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంతో ఈ ప్రాంతాన్నిపర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నా.. డంపింగ్ యార్డు నిర్వహణ వ్యవహారం కొలిక్కిరాకపోవడం వల్ల.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినప్పుడు.. చెత్త మొత్తం మానేరు నీటిలో కలుస్తోంది. మానేరులో చెత్తచెదారంపై ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తోన్న రిపోర్ట్.
దిగువ మానేరు పక్కనే డంపింగ్ యార్డ్.. విషతుల్యంగా మారుతున్న నీరు
ఇదీ చూడండి: 'రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు'
Last Updated : Oct 13, 2020, 10:31 AM IST