మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూలీ పనులు లేకపోవడంతో పిల్లాపాపలతో సహా పొట్ట చేత పట్టుకొని పనుల కోసం హైదరాబాద్ వచ్చారు. కరోనా వైరస్ వ్యాధి నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తమ సొంత గ్రామాలకు వెళ్లైనా గంజి నీళ్లు తాగి బతకొచ్చని హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్లడానికి ఐదు రోజుల క్రితం బయలుదేరారు.
కరీంనగర్‌కు చేరుకున్న వారికి జిల్లాలోని ప్రముఖ వైద్యులు అజయ్ పౌష్టిక ఆహారాన్ని అందించారు. ఇంట్లో తయారుచేసిన లడ్డూలను చిన్నారులకు అందజేశారు. ప్రభుత్వాలు సహాయాలు చేస్తున్నప్పటికీ.. ధనికులు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి వలస కార్మికులకు తోచినంత సహాయం చేయాలని ఆయన కోరారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని ఆయన వారికి సూచించారు.
ఇవీ చూడండి: 'లాక్డౌన్ తొలగించినా... విద్యాసంస్థల్లో భౌతికదూరం'
Body:h
Conclusion:hh