ఎంసెట్, నీట్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కె.శశాంక సూచించారు. ఈనెల 9, 10, 11, 14, 28, 29 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు, 13న నీట్ పరీక్ష జరుగుతుందని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 5,408 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు బస్సు వసతి కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవ రావు, పంచాయతీ అధికారి బుచ్చయ్య, ఆర్టీసీ ఆర్ఎం జీవన్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్వో రంగారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.