కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల కోసమే పోలీసుల నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. కిసాన్ నగర్, శివాజీ నగర్లో 200 మంది పోలీసులతో కట్టడి ముట్టడి చేపట్టారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 142 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, రెండు కార్లను సీజ్ చేశారు. 15 వేల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకొని.. అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాలనీలో 32 సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కాలనీవాసులను కమలాసన్ రెడ్డి అభినందించారు.
ఇవీ చూడండి: క్యూనెట్ మోసానికి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలి