కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాష్ట్ర మైనార్టీ కమిషన్ వైస్ ఛైర్మన్ శంకర్లు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎయిమ్ ఏషియా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు సరుకులిచ్చారు.
చొప్పదండి నియోజకవర్గంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ముఖ్యమంత్రి సూచించిన విధంగా లాక్డౌన్ నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యే రవిశంకర్ సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని చేతులెత్తి వేడుకున్నారు.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ