కరీంనగర్ నగరపాలక సంస్థలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కోసం అందరికి సీయూజీ నెంబర్లు అందజేసినట్లు మేయర్ సునీల్‌రావు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సంబంధించిన మొబైల్ నెంబర్లు అందరు అధికారుల వద్ద ఉండక పోవచ్చని అందువల్ల సమన్వయంతో పనిచేసేందకు సీయూజీలు దోహదపడతాయని వివరించారు.
విజిటింగ్ కార్డులతో పాటు గుర్తింపు కార్డులు.. లెటర్ ప్యాడ్లు అందజేశారు. ప్రజాసమస్యలు ఏమైనా ఉంటే కార్పొరేటర్లు సీయూజీ ఫోన్లతో మాట్లాడితే అధికారులు వెంటనే స్పందించేందుకు అవకాశం ఉంటుందని మేయర్ సూచించారు. 60 మంది కార్పొరేటర్లకు సీయూజీ నెంబర్లు అందజేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలో పన్నులు అధికంగా వసూలయ్యే విధంగా సహకరించాలని కార్పొరేటర్లకు కమిషనర్ క్రాంతి విజ్ఞప్తి చేశారు.