ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది' - cpm state secretery thammineni veerabhadram fires on govt

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కేంద్రంతో పోరాటానికి తెరాస ఒంటరిగా కాకుండా కలిసి వచ్చే శక్తులను కలుపుకుపోవాలని సూచించారు.

cpm-state-secretery-thammineni-veerabhadram-fires-on-govt
'కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది'
author img

By

Published : Sep 15, 2020, 11:42 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మతతత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా పోరాడాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రైతుల కోసం సీఎం పలు మంచి పథకాలను ప్రవేశపెట్టారని.. ఆ పథకాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించే ప్రయత్నం చేస్తోందని వీరభద్రం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఇందుకు తెరాస ఒంటరిగా కాకుండా కలిసి వచ్చే శక్తులను కలుపుకొని పోరాడాలని కోరారు. ఈ సందర్భంగా ఈనెల 10 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు.

ఇదీచూడండి.. అటవీశాఖ సిబ్బందిపై దాడి.. ఒకరి తలకు తీవ్ర గాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.