రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశఆరు. కరీంనగర్ జిల్లా సీపీఎం కొత్తపెల్లి జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం సుమారుగా రూ.3 లక్షల కోట్ల బకాయి ఉందని నాయకులు పేర్కొన్నారు.
ఇవ్వాల్సిన జీఎస్టీ డబ్బులు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తుందని మండిపడ్డారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను రోజుకొకటి చొప్పున అమ్మేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైల్వే రంగం, బీఎస్ఎన్ఎల్, రక్షణ రంగం, ఇన్సూరెన్స్ రంగాలను, విమానాశ్రయాలను అమ్మేసిందన్నారు. దేశంలో కరోనాతో చిరు వ్యాపారులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడి ఆర్థిక నష్టాలకు గురవుతున్నారన్నారని సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.