ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కరీంనగర్ బస్టాండులో కార్మికులకు మద్దతుగా సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా... పోలీసులు సీపీఐ కార్యకర్తలను అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రాస్తా రోకో చేపట్టిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: నడుస్తుంటే.. భూమి ఒక్కసారిగా కుంగిపోయింది