ETV Bharat / state

ఇద్దరికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయి.. ఈటలకు సీపీ కౌంటర్ - karimnagar cp satyanarayana on gun culture

నియోజకవర్గంలో ఇద్దరికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయి: సీపీ

author img

By

Published : Sep 14, 2022, 7:06 PM IST

Updated : Sep 14, 2022, 8:10 PM IST

19:04 September 14

హుజూరాబాద్‌లో తుపాకీ లైసెన్సులన్న ఈటల ప్రకటనపై సీపీ స్పందన

నియోజకవర్గంలో ఇద్దరికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయి: సీపీ

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విచ్చలవిడిగా తుపాకీ లైసెన్సులు ఇస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన ప్రకటనపై సీపీ సత్యనారాయణ స్పందించారు. తుపాకుల కారణంగా తనకు కానీ.. తన కుటుంబానికి చెందిన వారికి కానీ ఒక్క రక్తపు బొట్టు కారినా పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఈటల చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన సీపీ.. నియోజకవర్గంలో ఇద్దరికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయని స్పష్టం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గిపోయాయని.. ఇక్కడ ఎవరూ తుపాకీ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు.

ఇటీవల ఇల్లందకుంట ఎంపీపీ భర్త వెంకటేశం నడుముకు పెట్టుకున్న తుపాకీ కనిపించడం వివాదాస్పదంగా మారింది. అయితే ఆ విషయం తన దృష్టికి వచ్చిందన్న సీపీ.. అతడిని పిలిపించి విచారించి హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఇక ముందు తుపాకీని ప్రదర్శిస్తే లైసెన్సు రద్దు చేస్తామని తెలిపారు. విచ్చలవిడిగా లైసెన్సులు ఇస్తున్నామని ప్రచారం చేసిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇద్దరికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గిపోవడంతో కొత్తగా ఎవ్వరికీ లైసెన్సులు ఇవ్వలేదు. ఇక్కడ ఎవ్వరూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇల్లందకుంట ఎంపీపీ భర్తను పిలిపించి విచారించాం. ఇకముందు తుపాకీని ప్రదర్శిస్తే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించాం. విచ్చలవిడిగా లైసెన్సులు ఇస్తున్నారని ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.-సత్యనారాయణ, కరీంనగర్‌ సీపీ

ఇవీ చూడండి..

కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న 540 ఎకరాలపై సుప్రీం కీలక తీర్పు

లాకర్లలో 91కిలోల బంగారం, 340 కిలోల వెండి.. ఈడీ రైడ్స్​తో గుట్టు రట్టు.. విలువ ఎంతంటే..

Last Updated : Sep 14, 2022, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.