కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ కాకతీయ కాలువలో గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన దంపతులు గల్లంతైన విషయం విదితమే. భర్త ప్రదీప్‌ను సురక్షితంగా పోలీసులు తాడు సహాయంతో గట్టుకు చేర్చి ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఐసీయూలో మెరుగైన వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనంతో పాటు అతని భార్య ఆచూకీ లభ్యం కాకపోవడం వల్ల పోలీసులు కాకతీయ కాలువలో గాలింపులు చేపట్టగా.. ముంజంపల్లి కాలువ శివారులో మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు, పోలీసులు తాడు సాయంతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతదేహం చేపల వలకు చిక్కుకోవడం వల్ల గట్టుకు చేర్చడానికి సమయం పట్టింది. గట్టుకు లాగిన అనంతరం మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించారు. మృతదేహం వద్ద ప్రదీప్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చూడండి: సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం