కరీంనగర్ 36వ డివిజన్లో మేయర్ సునీల్ రావు చేతుల మీదుగా కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ 150 మంది పేదలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి తమ వంతు బాధ్యతగా పేద ప్రజలను ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు. పేదల ఆకలి తీరుస్తున్న కార్పొరేటర్‌ను మేయర్ అభినందించారు.
ఈ నెల 31 వరకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ... వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని విజ్ఞప్తి చేశారు.