వ్యాక్సినేషన్‌కు వచ్చే వయోవృద్ధులు రిజిస్ట్రేషన్ లేకుండా తమ వయస్సు ధ్రువీకరణ పత్రంతో నేరుగా టీకా తీసుకోవచ్చని కరీంనగర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత తెలిపారు. ఆస్పత్రుల్లో వారిపేరును ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా ఇస్తామని చెప్పారు. వ్యాక్సిన్ పట్ల క్రమంగా ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. రోజురోజుకు వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని, అవసరానికి అనుగుణంగా కేంద్రాల సంఖ్యనూ పెంచుతున్నామంటున్న వైద్యాధికారి డాక్టర్ సుజాతతో ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : బరువు పెరగాలనుకుంటున్నారా?.. అయితే ఈ చిట్కాలు మీకోసం