నగరంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 31 ప్రాంతాల్లో డ్రై రన్ నిర్వహించగా.. పలు చోట్ల కలెక్టర్ శశాంక పరిశీలించారు.
వ్యాక్సిన్ కోసం వచ్చే వారి వివరాలను ఎలా నమోదు చేస్తున్నా అడిగి తెలుసుకున్న కలెక్టర్... వ్యాక్సిన్ ఇచ్చే గదిని స్వయంగా పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్య శాఖాధికారి సుజాతతో పాటు ఆర్‌ఎంఓ రత్నమాలకు తగు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: అఖిలప్రియ ఆరోగ్యంపై కోర్టులో మెమో దాఖలు