ETV Bharat / state

Huzurabad by elections 2021: ఉప ఎన్నికల్లో టీకా పరీక్ష.. రెండో డోసు పూర్తయితేనే..! - తెలంగాణ వార్తలు

హుజూరాబాద్ ఉపఎన్నికల(Huzurabad by elections 2021) వేళ వ్యాక్సినేషన్ ప్రక్రియపై యంత్రాంగ్రం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి తొలి డోసు టీకా(vaccination in karimnagar) విషయంలో అప్రమత్తమయ్యారు. రెండో దఫా టీకాను(vaccination in 2021) తీసుకోవాల్సిన వారికి కూడా ఈ వారం రోజుల్లో నిర్ణీత గడువు సమీపించిన వారందరికీ అందించేలా చొరవను చూపిస్తున్నారు. మరోవైపు ఆయా పార్టీల ఏజెంట్లు కూడా కరోనా పరీక్షల్ని విధిగా చేయించుకోవాలనే నిబంధనల్ని పెట్టారు. దీంతో ప్రధాన పార్టీలకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగానే మారింది.

Huzurabad by elections 2021, vaccination in karimnagar
హుజూరాబాద్ ఉపఎన్నికలు 2021, కరీంనగర్​లో వ్యాక్సినేషన్
author img

By

Published : Oct 22, 2021, 10:24 AM IST

హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో(Huzurabad by elections 2021) టీకా అందరికీ పరీక్ష పెడుతోంది. మహమ్మారి రాకుండా రక్షణగా నిలిచే వ్యాక్సినేషన్‌ విషయంలో యంత్రాంగం ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రక్రియ వెలువడినప్పటి నుంచి మొదటి డోసు టీకాల విషయంలో జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది జోరుని చూపించారు. ఇప్పటి వరకు దాదాపుగా ఉన్న ఓటర్లలో 98శాతం మందికి మొదటి డోసు టీకాను అందించారు. రెండో డోసు విషయంలోనూ అనూహ్యంగా పురోగతిని చూపించారు. ఇప్పటి వరకు 62శాతం మంది ఓటు హక్కు కలిగిన వారికి రెండో దఫా వ్యాక్సినేషన్‌ను(vaccination in karimnagar) అందించగలిగారు. ఈ వారం రోజుల్లోనూ ఓటు వేసే ప్రతి ఒక్కరు టీకా వేసుకుని ఉండేలా పర్యవేక్షణను పెంచుతున్నారు. మిగతా రెండు శాతం మందిని గుర్తించి ఇంటింటికి వెళ్లి మొదటిడోసు టీకాను వేయబోతున్నారు. ఇక రెండో దఫా టీకాను తీసుకోవాల్సిన వారికి కూడా ఈ వారం రోజుల్లో ఎంతమందికి నిర్ణీత గడువు సమీపించినా వారందరికి అందించేలా చొరవను చూపిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గవ్యాప్తంగా సంచార వాహనాలను తిప్పుతూ టీకాలను(vaccination in 2021) వేయిస్తున్నారు. 2.36 లక్షల మంది ఓటర్లుండగా దాదాపుగా 2.31 లక్షల మందికి టీకాలను వేయగలిగారు.

ధ్రువీకరణలు తప్పనిసరి..

ఇప్పటికే ఇక్కడి ఎన్నికల్లో(Huzurabad by elections 2021) పాల్గొనే అన్ని రకాల సిబ్బంది విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. ఎన్నికల సంఘం సూచించిన విధంగా ఇప్పటివరకు విధుల్లో ఉంటున్న వారంతా రెండోసారి టీకాను వేసుకున్నట్లు ఎన్నికల అధికారికి ధ్రువీకరణల్ని సమర్పించి విధులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతకుముందు నామినేషన్‌ల ప్రక్రియ సమయంలోనూ పోటీ చేసే అభ్యర్థులతోపాటు వారికి మద్దతును తెలిపిన వారి విషయంలోనూ ఈ తరహా పత్రాలను ఎన్నికల అధికారులు తీసుకున్నారు. మరోవైపు ఈనెల 30వ తేదీన జరిగే పోలింగ్‌లో, నవంబరు 2న జరిగే ఓట్ల లెక్కింపుల్లో పాల్గొనే ఆయా పార్టీల ఏజెంట్లు కూడా కరోనా పరీక్షల్ని విధిగా చేయించుకోవాలనే నిబంధనల్ని పెట్టారు. దీంతో ప్రధాన పార్టీలకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగానే మారింది. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 305 పోలింగ్‌ కేంద్రాల్లో పాల్గొనే వారు కచ్చితంగా కరోనా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ ఉన్నట్లుగా ధ్రువీకరణను ఎన్నికల అధికారులకు విధిగా అందించాల్సి ఉంటుంది. మొదటి డోసు టీకా తీసుకున్న వారు, రెండో డోసుకు అర్హతలేనివారు పోలింగ్‌, లెక్కింపు తేదీలకు 72 గంటల ముందు ఈ పరీక్షను చేసుకుని ధ్రువీకరణను అందించాలి. అలాగే ఒక డోసు కూడా టీకా తీసుకోని వారైతే మాత్రం ఈ నిర్ణీత తేదీలకు 48 గంటలలోపు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసుకుని ధ్రువీకరణతో హాజరవ్వాలి. ఇక ఈ తరహా పరీక్షల నిర్వహణ కోసం ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లను జమ్మికుంటతోపాటు కమలాపూర్‌లో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Huzurabad by election: పోటాపోటీగా ఎన్నికల ప్రచారం.. ఒకరిపై ఒకరి విమర్శనాస్త్రాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.