ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్​లో తగ్గుతున్న కేసులు

ఉమ్మడి కరీంనగర్​లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఫలితంగా అధికారులు లాక్​డౌన్​ నిబంధనలను కొంత సడలిస్తున్నారు.

corona cases are Decreasing in Joint Karimnagar
ఉమ్మడి కరీంనగర్​లో తగ్గుతున్న కేసులు
author img

By

Published : May 1, 2020, 5:18 PM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతోంది. కొవిడ్​-19 ఉద్ధృతి క్రమంగా తగ్గుతుండటం వల్ల నిబంధనలను కొంత మేరకు సడలిస్తున్నారు. ఉదయం వేళల్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి అనుమతిస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో 19 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 18 మంది కోలుకుని ఇళ్లకెళ్లారు. ఒకరు చికిత్స పొందుతున్నారు. ఫలితంగా సాహిత్​నగర్, శర్మనగర్​లలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిబంధనలను సడలించారు.

జగిత్యాల జిల్లాలో 3 కేసులకు గానూ.. ఇద్దరు డిశ్ఛార్జి అయ్యారు. ఒకరు మాత్రమే చికిత్స పొందుతున్నారు. కోరుట్ల, కల్లూరుల్లో కంటైన్మెంట్ జోన్లను తొలగించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడగా.. వారు చికిత్స పొందుతున్నారు. వేములవాడ సిద్ధార్థనగర్​లో కంటైన్మెంట్ కొనసాగిస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.