Congress Ticket War in Karimnagar : కరీంనగర్‌తో పాటు మిగతా 5 స్థానాల్లో అభ్యర్థిత్వాల ఖరారు విషయంలో కాంగ్రెస్(Telangana Congress) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వడపోత ప్రక్రియపూర్తి కాగా.. మిగిలిన ఇద్దరు, ముగ్గురి పేర్లలో ఎవరిని ప్రకటించాలనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. కరీంనగర్‌లో 15 మంది పోటీ పడుతుండగా.. ఇందులో ముగ్గురి పేర్లను అధిష్ఠానం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న జైపాల్‌రెడ్డితో పాటు నరేందర్‌రెడ్డి, పుర్మల్ల శ్రీనివాస్, రోహిత్‌రావు గట్టి ప్రయత్నమే చేశారు. టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో నాయకులు గడపగడపకు కాంగ్రెస్ నినాదంతో ప్రచారం కూడా పెంచారు.
Telangana Congress MLA Tickets in Karimnagar : రాహుల్ గాంధీ(Rahul Gandhi) పర్యటన అనంతరం అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని ధీమాగా ఉన్నవారు కాస్తా.. ఇప్పుడు డీలా పడినట్లు కన్పిస్తోంది. ప్రకటన వెలువడితే తప్ప ప్రచారంలో పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదు. రాహుల్ నగరంలో పర్యటించినా ఎవరిని ప్రోత్సహించకుండా జాగ్రత్తపడటంతో ఉత్కంఠ పెరిగింది. చొప్పదండిలో మేడిపల్లి సత్యం ‘గడప గడపకు కాంగ్రెస్’ పేరుతో ప్రచారం చేశారు. ఆయన పేరు మొదటి జాబితా(Congress MLA Candidates First List)లో లేకపోవడం.. శ్రేణుల్ని అయోమయంలో పడేసింది.
Ticket War in Telangana Congress : రాహుల్ పర్యటన వెదిర, గంగాధర మీదుగా సాగినప్పటికీ.. ఆయన ఎక్కడ కూడా మాట్లాడకుండా వెళ్లిపోవడంతో.. మేడిపల్లి సత్యం ప్రచారాన్ని కొంతమేరకు తగ్గించారు. నియోజకవర్గంలో మాలల కంటే మాదిగలు అధికశాతం ఉండటం వల్ల వారికే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో కొత్తగా మరో రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. నాగిశేఖర్‌తో పాటు గిల్లాల భానుప్రియ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
Telangana Assembly Elections 2023 : సిరిసిల్లలో దరఖాస్తు చేసుకున్న వారిలో సామాజిక సమీకరణాల ఆధారంగా పోటీదారుడిని తేల్చే పనిలో పార్టీ పెద్దలున్నారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు కేకే మహేందర్‌రెడ్డి పోటీ పడుతూ వచ్చారు. తాజాగా సంగీతం శ్రీనుపై చర్చ జరుగుతోంది. ఇక్కడి సామాజిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈసారి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతుండటంతో ఇక్కడి అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Jagtial Congress MLA Tickets Issue : జగిత్యాల జిల్లా కోరుట్లలోనూ తొలి జాబితాలో పేరు లేక ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే జువ్వాడి నర్సింగరావు ప్రచారానికి శ్రీకారం చుట్టగా.. కొమ్మిరెడ్డి కరంచంద్ టికెట్ కోసం ఒత్తిడి తీసుకొస్తుండటంతో ఎవరి పాచిక పారుతుందా అన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ చోటు చేసుకొంది. మొదటి నుంచి హుజూరాబాద్‌లో బల్మూరి వెంకట్ పేరు ఖరారైందని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత పార్టీలో ప్రణవ్‌రావు చేరడంతో ప్రతిష్ఠంభన నెలకొంది. ఉపఎన్నికల్లో పోటీ చేసిన వెంకట్.. ఆ తర్వాత కూడా నియోజకవర్గంలోనే ఉంటూ సమస్యలపై పోరాడుతూ వస్తుండగా పేరు ఖరారు కాకపోవడంతో ఆయన కూడా ప్రచారాన్ని తగ్గించారు. హుస్నాబాద్‌లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి.. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ప్రచారం కొనసాగించారు. తాజాగా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ప్రవీణ్‌రెడ్డి కూడా తన ప్రచార రథాలు సిద్ధం చేసుకున్నారు.
Congress Ticket War in Palamuru : ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ టికెట్ దక్కించుకునేదెవరు..?
Ticket War in Telangana Congress : కాంగ్రెస్‌లో కలహాలు.. తారాస్థాయికి చేరిన టికెట్ కొట్లాట