ప్రభుత్వం సూచించిన పంటలను మాత్రమే సాగు చేయాలని సీఎం నిర్దేశించడం సరికాదని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం కరీంనగర్ జిల్లా గంగాధరలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల అభీష్టంతో సంబంధం లేకుండా పంటలు సాగుచేయాలనటం సహేతుకం కాదన్నారు.
ఏ పంటా సాగు చేసేది ప్రభుత్వం నిర్దేశిస్తే రైతులు తమ సొంత భూముల్లోనే కూలీలుగా మారతారన్నారు. రైతులను ముఖ్యమంత్రి అవమానించటం సమంజసం కాదన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సిబ్బందిని తొలగించి నిర్వీర్యం చేస్తున్నారని సత్యం విమర్శించారు.