హుజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad By Election)లో సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన పార్టీ ఈసారైనా పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. 2018 ఎన్నిక (Huzurabad By Election)ల్లో హుజూరాబాద్‌లో 61 వేల ఓట్లకు పైగా సాధించి రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు తాజా ఎన్నిక ప్రధాన సవాల్‌గా మారింది. 2004 నుంచి వరుసగా ఓడుతున్నా.. ద్వితీయ స్థానంలో ఉంటూ వస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరడంతో పాటు నియోజకవర్గంలోని మండలస్థాయి ముఖ్యనేతల్లో పలువురు తెరాస, భాజపాల్లో చేరారు. దీంతో కాంగ్రెస్ స్థానికంగా నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది.
అభ్యర్థి (Huzurabad By Election)ని ఖరారు చేయడంలోనే కాంగ్రెస్ తీవ్ర జాప్యం చేసింది. స్థానిక నేతలను బరిలో దింపాలా? బయటి వారిని పోటీ చేయించాలా? అనే సందిగ్ధత కొన్నాళ్లు కొనసాగింది. చివరకు ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బరి (Huzurabad By Election)లో దింపింది. ఎలాంటి సామాజిక సమీకరణలనూ పరిగణనలోకి తీసుకోలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్యనేతలైన మాజీమంత్రి, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, సీనియర్ నేత ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపడంతో పీసీసీ ఆమోద ముద్ర వేసింది. ఆయన నామినేషన్ దాఖలు అనంతరం కాంగ్రెస్ రాష్ట్రస్థాయి ముఖ్యనేతలతో పాటు జిల్లా నేతలు ప్రచారం (Huzurabad By Election)లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కాగా నాగార్జునసాగర్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓట్లను కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై అంతర్గత సమీక్ష ముగిసిందని, ఇక గ్రామ స్థాయి నుంచి నాయకత్వంపై దృష్టి సారిస్తామని పార్టీ నేతలు తెలిపారు.
ఇదీ చూడండి: Revanth Reddy Republic Movie: రిపబ్లిక్ చిత్రాన్ని వీక్షించిన రేవంత్‌రెడ్డి, సీతక్క
Huzurabad By Election Campaign: పదునెక్కిన ప్రచారం... నువ్వానేనా అంటోన్న తెరాస, భాజపా
Huzurabad by-election: 'హుజురాబాద్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి'
Huzurabad Bypoll 2021: అమల్లోకి ఎన్నికల నియమావళి.. ఆ పథకాలకు ఇబ్బంది లేదు: శశాంక్ గోయల్
Dalitha Bandhu: హుజూరాబాద్‌లో మరోసారి ఇంటింటి సర్వే
huzurabad by poll: బరిలోకి దిగే హస్తం పార్టీ అభ్యర్థి ఎవరు..?
నామినేటెడ్ ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి
'కౌశిక్ రెడ్డి.. తీరు మారకుంటే కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తాం'