మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కరీంనగర్‌లో బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కోర్టు చౌరస్తా నుంచి మంత్రి ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరిన నాయకులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
పోలీసులకు కాంగ్రెస్ నాయకుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకొంది. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని నిరసన కార్యక్రమాలు చేపట్టనీయడం లేదని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. అత్యాచారాలకు పాల్పడిన వారిలో అధికార పార్టీకి చెందిన వారు ఉండటం వల్ల వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తోందని ఆరోపించారు.
నిందితులను అరెస్టు చేయాల్సిన పోలీసులు నిరసన చేస్తున్న తమను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ముట్టడికి యత్నించిన వారందరినీ అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.
ఇదీ చదవండి: వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 12 వేల పోస్టుల భర్తీ