భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్లో తెరాస చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని తెలంగాణ చౌక్‌లో తెరాస నాయకులు నిరసన చేపట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న భాజపా కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఫలితంగా ఇరువర్గాల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: తరుముకొస్తోంది మనువు.. తల్లడిల్లుతోంది తనువు!