కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజపల్లి గ్రామంలో రైల్వే భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైల్వే సోషియో ఎకనామిక్ సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారుల ముందు బైఠాయించారు.
పదిహేనేళ్ల క్రితం కరీంనగర్ -నిజామాబాద్ రైల్వే లైను కోసం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: చనిపోయిన పావురం తీయడానికెళ్లి లైన్‌మన్ మృతి