ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా విధులు బహిష్కరించి.. కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
నూతన ప్రతిపాదనల వల్ల.. ఎల్‌ఐసీ సంస్థ నష్టపోయే ప్రమాదముందంటూ ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం.. వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గెలవాలంటే ఎవరికెన్ని ఓట్లు కావాలో తెలుసా..?