ETV Bharat / state

వేగంగా కొనసాగుతున్న ప్రజాపాలన కంప్యూటరీకరణ - తెల్లకాగితాల దరఖాస్తులకు నో ఛాన్స్ - ప్రజాపాలన కంప్యూటరీకరణ

Computerization of Prajapalana applications in Karimnagar District : ప్రజాపాలనలో ఐదుగ్యారంటీలకు దరఖాస్తులు ఆహ్వానించినా చాలా మంది ఇతర సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఆయా దరఖాస్తుల కంప్యూటరీకరణ శరవేగంగా సాగుతోంది. స్వీకరించిన దరఖాస్తుల్లో కేవలం గ్యారంటీలను మాత్రమే నమోదుచేస్తున్న అధికారులు ఇతర పథకాల కోసం అందిన వాటిని పక్కన పెడుతున్నారు. పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని మంత్రి శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు.

Prajapalana Praogramme
Computerization of Prajapalana applications in Karimnagar District
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 10:33 PM IST

వేగంగా కొనసాగుతున్న ప్రజాపాలన కంప్యూటరీకరణ- పక్కకు పెట్టెసిన తెల్లకాగితాల దరఖాస్తులు

Computerization of Prajapalana applications in Karimnagar District : ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన ఐదుగ్యారంటీల దరఖాస్తుల కంప్యూటరీకరణ శరవేగంగా సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఐదు గ్యారంటీలు సహా ఇతర పథకాల కోసం 12 లక్షల 36 వేల 938 దరఖాస్తులు వచ్చాయి. ఐదు గ్యారంటీల కోసం 10 లక్షల 69వేల 993 దరఖాస్తులు రాగా లక్ష 66వేల 945 అర్జీలు ఇతర సమస్యల కోసం వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో గ్యారెంటీలకు 3 లక్షల 22వేలు 32వేలు ఇతర అర్జీలున్నాయి.

ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలు - బాధ్యుడైన అధికారి సస్పెండ్

జగిత్యాల జిల్లాలో గ్యారంటీలకు 3 లక్షల 19వేలు, ఇతరాలకు 68వేలు పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల 36వేలు ఐదు గ్యారంటీలకు, ఇతర ఆర్జీలు 38 వేలు వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష 90 వేలు గ్యారంటీల కోసం రాగా, ఇతర అంశాలకు సంబంధించి 28 వేల దరఖాస్తులు వచ్చాయి. సదరు నాలుగు జిల్లాల్లో ఇప్పటికే 95 శాతం వివరాలను ప్రజాపాలన(Prajapalana) వెబ్‌సైట్‌లో పొందుపర్చగా ఈనెల17 లోగా ప్రభుత్వానికి అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇతర పథకాల్లో అత్యధికంగా రేషన్‌కార్డు, రెండు పడక గదుల ఇళ్లు, బీసీ, దళితబంధు, సదరం ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు పలువురు తెలిపారు.

Prajapalana Praogramme : ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టిసారించడంతో ఇతరసమస్యల కోసం అర్జీ పెట్టుకున్న మిగిలినవారి వివరాలను భద్రంగా దాచిపెట్టారు. ఇతర దరఖాస్తులను కొందరు పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీల్లోనే భద్రపర్చారు. ఇంకొందరు కార్యదర్శులు వాటిని ఆయా ఎంపీడీవో కార్యాలయాలకు పంపారు. వాటి వివరాలను నమోదు చేసే అవకాశం లేకపోవడంతో ఆ విధంగా చేసినట్లు వారు చెబుతున్నారు.

కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు - మరో మూడు పథకాల అమలుపై సర్కార్ కసరత్తు

ఇప్పటివరకు ఆయా సమస్యలపై ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చాకనే నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నమోదు ప్రక్రియ కొనసాగుతోందని లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar babu) పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన వెబ్‌సైట్‌లో అయిదు గ్యారంటీల వివరాలు మాత్రమే నమోదు చేసినట్లు తెలిపిన అధికారులు, తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత మిగతా వాటిని నమోదు చేస్తామని చెబుతున్నారు.

"రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. దాదాపు పూర్తికావొచ్చింది. క్షేత్రస్థాయిలో గ్రామాలలో పర్యటించి అర్హులైన లబ్ధదారులను ఎంపిక చేస్తాము. ఎన్నికల హామీలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం". - శ్రీధర్‌బాబు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి

ఉచిత కరెంట్‌కు బకాయిల షాక్ - ఎరక్కపోయి ప్రజాపాలన దరఖాస్తుతో ఇరుక్కుపోయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.