కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న పోలీసు క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు. సీపీ కమలాసన్ రెడ్డితో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతిని వెలిగించారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు.
4 సంవత్సరాల తరువాత నిర్వహించే ఈ పోటీలకు పోలీసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అథ్లెటిక్స్ పోటీలతో పాటు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, కో కో వంటి క్రీడలను నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషం : ఇంద్రకరణ్ రెడ్డి