కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పర్యటించారు. ఓగులాపూర్లోని మిడ్ మానేరు లింక్ కెనాల్, చిగురుమామిడి-సైదాపూర్ కుడి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.
చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో లింక్ కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు తమకు పరిహారం అందలేదని కలెక్టర్, ఎమ్మెల్యేలకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా భూనిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
లింక్ కెనాల్ పనులను అడ్డుకోకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే సతీశ్ కోరారు. మిడ్ మానేరు లింక్ కెనాల్ పూర్తయితే చిగురుమామిడి, సైదాపూర్ మండలాలతో పాటు మానకొండూర్ మండలంలోని 70 వేల ఎకరాలకు గోదావరి జలాలు అంది భూములు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి... కరోనా పాజిటివ్ వచ్చినా.. కారు జోరు ఆగదు