మాజీ మంత్రి రత్నాకర్ రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రత్నాకర్ రావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తదితరులు కూడా రత్నాకర్ రావు మృతి పట్ల సంతాపం తెలిపారు.
జువ్వాడి రత్నాకర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా బుగ్గారం నియోజకర్గం నుంచి 1989, 1999, 2004లో గెలుపొందారు.
ఇవీ చూడండి: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు మృతి