సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామకు చెందిన గౌడ శివాజీ ఈ నెల 10న గుండెపోటుతో మరణించాడు. శివాజీ మరణంతో భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. వారిని ఆదుకునేందుకు అతనితో కలిసి 2000-2001లో పదో తరగతి చదువుకున్న మిత్రులు ముందుకు వచ్చారు. ఇద్దరు ఆడపిల్లల పేర 50 వేల చొప్పున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. భవిష్యత్తులోనూ వారి చదువులకు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. స్నేహితుని కుటుంబాన్ని ఆదుకున్న మిత్రబృందాన్ని గ్రామస్థులు అభినందించారు.
ఇదీ చూడండి: తండ్రిని ముక్కలుగా నరికి... బకెట్లో పడేశాడు