కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గాయత్రి పంప్ హౌస్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆరేళ్ల స్వల్ప కాలంలో బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేశారని కొనియాడారు. దశాబ్దాలుగా అధికారంలో కొనసాగిన వివిధ పార్టీల నాయకులు సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం గాయత్రి పంప్ హౌస్, ఎస్సారెస్పీ వరద కాలువ, మద్య మానేరు ప్రాజెక్టు, నారాయణపూర్, పోతారం జలాశయాలతో చొప్పదండి నియోజకవర్గం నీటి హబ్‌గా మారిందని పేర్కొన్నారు. గోదావరినది జలాల ఎత్తిపోతలతో తెలంగాణలో లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.