కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. అభివృద్ధి పనులు పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే వాహనాన్ని తాటివనం వైపు మళ్లించారు. గీత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో ముంజలు కోయించి తిన్నారు.
వేసవిలో తాటి ముంజలు చల్లదనాన్ని ఇస్తాయని రవిశంకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల కోసమే నీరా పాలసీని ప్రవేశపెట్టిందని తెలిపారు.