కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన గుర్రం పరుశరాములు, కవిత దంపతులు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం పరుశరాములు, కవిత అనారోగ్యంతో మృతి చెందారు. వీరి పిల్లలైన గుర్రం నవిత(15), గుర్రం నవీన్(6)ను నానమ్మ సత్తవ్వ చూసుకుంది.
వీరికున్న ఏకైక ఆస్తి పెంకుటిల్లు. ఇది కూడా కూలిపోవడం వల్ల పక్కింట్లో కాలం గడుపుతున్నారు. ఇటీవలే వీరి నానమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో చిన్నారులు అనాథలయ్యారు. గూడు చెదిరిన పక్షులయ్యారు. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గుర్రం నవిత , గుర్రం నవీన్ కుమార్ లకు రూ.లక్ష నగదును అందజేశారు.
దాతల సహకారంతో ఇప్పటివరకు రూ. రెండు లక్షల నగదును అనాథ పిల్లలకు అందినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇద్దరి విద్యాభ్యాసానికి సహాయం చేస్తామన్నారు. అనాథ పిల్లలకు మేమున్నామంటూ సహాయంగా నిలిచిన గ్రామస్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు