కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మంగళపల్లికి చెందిన నిరుపేద విద్యార్థిని పెద్దెల్లి ఆపేక్ష.. ఇటీవలే తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీలో కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్‌కు ఎంపికయ్యింది. కానీ శిక్షణ కోసం రూ.2 లక్షల 50వేలు ఫీజు చెల్లించలేక నిరాశకు గురైంది. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రూ.లక్ష 30వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
నిరుపేద దళిత విద్యార్థిని ప్రతిభను అభినందించడంతో పాటు భవిష్యత్‌లో ఆమెకు అండగా ఉంటామని అన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు విద్యా, ఉద్యోగ సాధనలో ముందుండాలని ఆకాంక్షించారు. చొప్పదండి సహకార సంఘం మరో లక్ష రూపాయలు రుణం మంజూరు చేసింది. విద్యార్థిని తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: పాతబస్తీ రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు