కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ గ్రామంలో 723, 724 సర్వే నెంబర్‌లోని తన ఏడెకరాల భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సానా మారుతీరావు విజ్ఞప్తి చేశారు. 1971లో తన భార్య పేరుపై భూమిని కొనుగోలు చేశానని.. ఆ భూమిని కొందరు మాఫియాతో కలిసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తమ భూమి పక్కనే మాజీ ఎమ్మెల్యే కొండయ్యకు నాలుగెకరాల 20గుంటల భూమి ఉందన్నారు. కొండయ్య కుమార్తెలు ల్యాండ్ మాఫీయాతో చేతులు కలిపి తన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగాల భర్తీ విషయంలో సర్కార్కు చిత్తశుద్ధి లేదు'