కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో 61 మంది కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 61 లక్షల 51 వేల చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ప్రత్యేకతని చాటుకుంటోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథకాలు నిరుపేదలకు ఎంతగానో ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు.
ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'మా గోడును వినండి... మమ్మల్ని ఆదుకోండి'