కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ప్రపంచ విప్లవకారుడు చేగవేరా 92వ జయంతిని ఏఐఎస్ఎఫ్-ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ప్రపంచ విప్లవకారుల్లో చేగవేరా ప్రముఖుడిగా నిలిచారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనగిరి మహేందర్ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ఆయన విప్లవ భావాలకు ఆకర్షితులయ్యారని తెలిపారు. లాటిన్ అమెరికా దేశాల్లోని పేద ప్రజల అభ్యున్నతికి ఉద్యమించిన గొప్ప వ్యక్తి చేగువేరా అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని.. ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు.