ప్రధాన రహదారుల్లో అతివేగం వల్ల చోటు చేసుకుంటున్న ప్రమాదాలు, మరణాలను అరికట్టేందుకు స్పీడ్ గన్స్ వినియోగించనున్నట్లు కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ పరికరాలు నగర పరిధిలో కాకుండా బైపాస్‌రోడ్డులో మాత్రమే వినియోగించనున్నామన్నారు. ట్రాఫిక్ సిబ్బందికి హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. వేగంగా వెళ్లే వాహనాలకు ఈ చలాన్ ద్వారా రూ.1000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు. ఈ చలాన్ అనుసంధానం ఏర్పడిన తర్వాతే వీటిని వినియోగిస్తామని సీపీ కమలాసన్‌రెడ్డి వివరించారు.
ఇవీ చూడండి : 'రాష్ట్రంలో హత్య రాజకీయాల ప్రభుత్వం నడుస్తోంది'