పార్లమెంటు ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఈ 48 గంటలు నిబంధనలు ఉల్లంఘిస్తే.. కేసులు నమోదు చేస్తామని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. స్థానికేతర నేతలు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి లాడ్జీలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు అద్దెకు ఇవ్వకూడదని సూచించారు.
పోలింగ్ రోజు ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఇతర రాష్ట్రాల పోలీస్ బలగాలను రప్పించామని సీపీ స్పష్టం చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఇవీ చూడండి : క్రికెట్ ఆడినా... వాలీబాల్ ఆడినా... ఓట్లకోసమే