సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని కరీంనగర్ అడిషినల్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లిలో సీఐ సృజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సుమారు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ధ్రువీకరణ పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. ఈ సోదాలను హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావులు కూడా పర్యవేక్షించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగలను అవలీలగా గుర్తించవచ్చని కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గత పదేళ్ల క్రితం కరీంనగర్‌లో దొంగతనాలు అధికంగా జరిగేవని.. ఇప్పుడు మాత్రం జరగడం లేదన్నారు. ప్రతి అడుగుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో 12 సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకుంటామని గ్రామస్థులు స్వచ్ఛందగా ముందుకు వచ్చారు.
ఇవీ చూడండి: నల్గొండలో రచ్చరచ్చ..ఎమ్మెల్యేల కొట్లాట..