ETV Bharat / state

కాల్వలో పడిన కారు.. ముందు రోజు ఎటు వెళ్లిందంటే.! - కాల్వలో పడిన కారు... ముందు రోజు ఎటు వెళ్లిందంటే...!

కాకతీయ కాల్వలో పడి ముగ్గురు మరణించిన ఘటనలో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అసలు కారు ఎప్పుడు ఎక్కడికి వెళ్లిందనే వివరాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈ నెల 27 న కారు బయలుదేరిందని అంచనా వేస్తున్న పోలీసులకు... అంతకు ముందు ఆ కారు ఎటువైపు వెళ్లిందనే సీసీ టీవీ దృశ్యాలు లభ్యమయ్యాయి.

CAR ACCIDENT BEFORE CC FOOTAGE VISUALS AT RENIGUNTA TOLL PLAZA

author img

By

Published : Feb 18, 2020, 10:46 PM IST

కరీంనగర్‌ జిల్లా అలుగునూరు కాకతీయ కాలువలో బోల్తా పడి ముగ్గురు జలసమాదైన కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి రాధికతో పాటు బావ, కోడలు వినయశ్రీ గత నెల 27న ఇంటి నుంచి కారులో బయలుదేరి వెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

రేణిగుంట టోల్‌ప్లాజాలోని సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించగా... జనవరి 26 న ఉదయం 11గంటలకు కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లినట్లు దృశ్యాలు నమోదయ్యాయి. అదే రోజు రాత్రి 8:15 గంటలకు కారు కరీంనగర్‌కు తిరిగి వచ్చినట్లు దృశ్యాలు నమోదయ్యాయి.

గత నెల 27న మధ్యాహ్నం 3గంటలకు తన యజమాని ఫోన్​చేసి రీఛార్జ్​ చేయించమన్నారని నర్రె సత్యనారాయణరెడ్డి ఫర్టిలైజర్ దుకాణంలో పనిచేసే గుమాస్తా నర్సింగ్‌ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ వెళుతూ కాలువలో పడిపోయారా... లేదా మరుసటి రోజు అందులో పడిపోయారా అన్న విషయం స్పష్టత రావాల్సి ఉంది.

కాల్వలో పడిన కారు... ముందు రోజు ఎటు వెళ్లిందంటే...!

ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.