కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డులో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. తలసేమియాతో బాధపడేవారి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణానికి చెందిన యువకులు రక్తదానం చేశారు.
రక్తదానం మహాదానమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఇందుకు యువకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తదానంచేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఇదీ చదవండి: కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి పరుగులు