రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న భాజపా, ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులతో పాటు తెరాస శ్రేణులు దాడి చేశారని... భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఆరోపించారు. ఆ దాడిని ఖండిస్తూ కరీంనగర్ జిల్లాలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఏబీవీపీ, భాజపా కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇదే పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు యూనిఫాం ముసుగులో తెరాస కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖుల ఆకాంక్ష