కరీంనగర్లో భాజపా కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షునిగా బండి సంజయ్ నియామకంతో ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు నృత్యాలు చేశారు. తెలంగాణ చౌక్‌లో టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
బండి సంజయ్ బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులుగా పనిచేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పట్టణ కన్వీనర్‌గా, ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. 1994 నుంచి 2003 వరకు కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు డైరెక్టర్లుగా పనిచేశారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస