ETV Bharat / state

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: బండి సంజయ్ - బండి సంజయ్ వార్తలు

కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

author img

By

Published : Mar 30, 2021, 11:20 AM IST

కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. లక్ష్మీ నరసింహున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి.. మొక్కులు చెల్లించుకున్నారు. బండి సంజయ్​కి ఆలయ కమిటీ ఛైర్మన్ దన్నమనేని శ్రీనివాసరావు, ఆలయ ఈఓ ముద్దసాని శంకరయ్య శాలువా కప్పి సత్కరించారు.

రాష్ట్ర ప్రజలు, రైతులు లక్ష్మీనరసింహస్వామి కృపతో బాగుండాలని కోరుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, సీనియర్ నాయకులు తమ్మిశెట్టి మల్లయ్య, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కల్యాణ్ చంద్ర, నాయకులు సొల్లు అజయ్ వర్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.